సిఎల్పీపై హైకమాండ్ దే నిర్ణయం: డిఎస్

టెక్కలి ఉప ఎన్నిక ఫలితాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెసు విజయపరంపర ఇలాగే కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గెలుపు వార్తను ఫోన్ లో పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలిపినట్లు ఆయన చెప్పారు. సానుభూతి వల్లనే కాంగ్రెసు విజయం సాధించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యను ఆయన కొట్టి పారేశారు. సహజ పరిణామాలను కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకోవాలని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications