హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా టెక్కలి శాసనసభ ఉప ఎన్నికలో తమ ఓట్లు తమకు వచ్చాయని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు డబ్బులు వెదజల్లినా తమ పార్టీ ఓట్లు తమ పార్టీకి వచ్చాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ ఓటు బ్యాంక్ చెక్కు చేదరలేదని ఆయన అన్నారు. ఇది కాంగ్రెసు విజయం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
టెక్కలి ఉప ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మూడో స్థానంలో నిలిచాడు. డిపాజిట్ కూడా దక్కలేదు. గతంలో కన్నా ఈసారి ప్రజారాజ్యం పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. అలాగే లోక్ సత్తాకు కూడా డిపాజిట్ దక్కలేదు.