ఆస్తులు: చిక్కుల్లో కర్నాటక సిజె

దినకరన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ ఢిల్లీకి పిలిపించారు. దినకరన్ పై వచ్చిన ఆరోపణలపై భూషన్, ఇతర ప్రతినిధులు గురువారం న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీని కలిసే అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాదుల ప్రోద్బలంతో మద్రాసు హైకోర్టు న్యాయవాదులు దినకరన్ పై వివరాలను సుప్రీంకోర్టుకు పంపారు. ఈ స్థితిలో దినకరన్ ను సుప్రీంకోర్టులో నియమించకూడదని భూషన్ కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలను దినకరన్ కొట్టిపారేస్తున్నారు.
తన పేరు మీద, తన భార్య, కూతుళ్ల పేరు మీద దినకరన్ 450 ఎకరాల భూమిని సంపాదించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది క్రూర నేరగాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ దినకరన్ బెయిల్ ఆదాలత్ ద్వారా ఒక గంటలో 500 మందిని విడుదల చేశారు. వీటితో పాటు ఆయనపై వచ్చిన ఆరోపణల జాబితా చాలా పెద్దగానే ఉంది.












Click it and Unblock the Notifications