కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తనయుడు, కరీంనగర్ జిల్లా సిరిసిల్లా శాసనసభ్యుడు కెటి రామారావును పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలోని గర్జనపల్లిలో జడ్పీటిసి ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని జడ్పటీసి ఉప ఎన్నికలను తెరాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్ జడ్పీటిసీ పోలింగ్ సందర్భంగా కాంగ్రెసు, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.