జగన్ అయితేనే మంచిది: ఉప్పునూతల

V Purushotham Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మంచిదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కాంగ్రెసుకు మంచిదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ ఎంపికలో సీనియర్ల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్ఠాన వర్గానికి సూచించారు. కొందరు అధిష్ఠానవర్గాన్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి తాను ఎప్పుడు కూడా వ్యతిరేకిని కానని ఆయన అన్నారు. వైయస్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే తాను తెలంగాణపై పార్టీ అధిష్ఠాన వర్గం మీద ఒత్తిడి తీసుకురాలేదని ఆయన అన్నారు.

సాంకేతిక కారణాల వల్లనే వైయస్ జగన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో పార్టీ అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని మరో కాంగ్రెసు నేత టి. జీవన్ రెడ్డి అన్నారు. ఆయన విడిగా బుధవారం మీడియా ప్రతినిదులతో మాట్లాడారు. అయితే జాప్యం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వైయస్ కుటుంబమంటే కాంగ్రెసు, కాంగ్రెసు అంటే వైయస్ కుటుంబం అనే భావన ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అనుభవజ్ఞుడని, రోశయ్య లేని క్యాబినెట్ ను ఊహించలేమని ఆయన అన్నారు. అయితే ప్రజాభిమానం మాత్రం జగన్ కే ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+