చిరంజీవిని కాదన్న రోశయ్య

Rosaiah
హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి డిమాండ్ ను ముఖ్యమంత్రి కె.రోశయ్య తిరస్కరించారు. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, తదితర అంటువ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం లేదని రోశయ్య బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. స్వైన్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూ నిరోధానికి యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అదుపు చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేసారు. పరిపాలన స్తంభించిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను ఆయన కొట్టిపారేశారు. మంత్రులు బాగానే పని చేస్తున్నారని ఆయన చెప్పారు. ఖజానా స్తంభించిపోయిందని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+