జగన్ పై తేల్చేసిన హైకమాండ్

ముఖ్యమంత్రి కార్యాలయం సి - బ్లాక్ లోకి వెళ్లడానికి రోశయ్య ఎదురుచూస్తున్నారు కదా, వెళ్లాలని మీరెందుకు సూచించరని మీడియా ప్రతినిధులంటే తాను చెప్పాల్సింది చెప్పానని, అంతకు మించి చెప్పడానికేమీ లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే ఉన్నారని, పార్టీ తరఫున గానీ, ప్రభుత్వం తరఫున గానీ చర్యలేమైనా తీసుకోవాల్సి ఉంటే తగిన సమయంలో తీసుకుంటామని ఆయన అన్నారు. మీడియాకు చెప్పాల్సిందేమైనా ఉంటే కచ్చితంగా చెబుతామని ఆయన అన్నారు.
శుక్రవారం సాయంత్రం సోనియా గాంధీ అధ్యక్షతన ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై చర్చ ఎక్కువగా సాగలేదని తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాలపై నిర్ణయమేదీ లేకుండానే చర్చను వాయిదా వేశారు. ప్రస్తుతం నాయకత్వ మార్పిడి అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడొకరు చెప్పారు.












Click it and Unblock the Notifications