రోశయ్యను సిఎం అనుకోరు: నారాయణ

ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కరువు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా గోదాముల్లో దాచిన నిల్వలను పట్టించినా అధికారులు వాటిపై కేసులు నమోదు చేయడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని, ఇలాంటి స్థితిలో ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని గల్లీలు తప్ప నాగేందర్ కు రాష్ట్రంలోని వివరాలు తెలియవని ఆయన వ్యాఖ్యానించారు. హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కు మధ్య సమన్వయం లేదని ఆయన తప్పుపట్టారు.












Click it and Unblock the Notifications