హైదరాబాద్ లో మరో స్వైన్ మృతి

కాగా, ఇతర రాష్ట్రాల నిర్లక్ష్యం వల్లనే మన రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. స్వైన్ ఫ్లూపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రివర్గం పూర్తిగా సహకరిస్తోందని ఆయన చెప్పారు. వైయస్ మరణాంతరం సంభవించినవి సాధారణ మరణాలంటూ వచ్చిన వార్తాకథనం కుట్రతో కూడుకున్నదని ఆయన విమర్శించారు. వార్తాకథనాన్ని ప్రచురించిన పత్రిక దర్యాప్తు చేసిన విధానాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications