విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గల కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు మొదటి రోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయవాడ పోలీసులు అమ్మవారికి పట్టు వస్త్రాలను బహూకరించారు. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. దీంతో భక్తులు పెద్ద యెత్తను తరలి వస్తున్నారు.
అంతరాలయంలోని ఉత్సవ విగ్రహాన్ని భవానీ దీక్షా మండపానికి తీసుకురావడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.