యువరాజ్యం పవన్ కళ్యాణ్ దే

యువరాజ్యం సంస్థాగత వ్యవహారాలను చూడడానికి చురుకైన యువనేతను యువరాజ్యం అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ కు అనుకూలమైన యువ నేతను అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి సమావేశాలు, సభలు తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం లేకపోతే పార్టీకి యువత మద్దతు తగ్గుతుందనే అనుమానం నాయకత్వానికి ఉంది. దీంతో యువత సారథ్య బాధ్యతలు మాత్రం పవన్ కే ఉంటాయని అంటున్నారు. కాగా, మహిళా రాజ్యాన్ని పునర్వ్యస్థీకరిస్తామని చిరంజీవి చెప్పారు. మహిళారాజ్యం అధ్యక్షురాలు శోభారాణి ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారారు. దీంతో ఆమెను మార్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications