రోశయ్య చాలా కాలమే

రోశయ్యను మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగించడం ఖాయమనేది తేలిపోయింది. అంతేకాకుండా పూర్తి కాలం ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. రోశయ్య మంచి రోజు చూసుకుని సి - బ్లాకులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి మారడానికి సిద్ధపడ్డారు. తాను ఎంత కాలం కొనసాగుతానో తెలియని అనిశ్చిత స్థితి వల్ల, జగన్ వర్గం మనోభావాలను దెబ్బ తీయడం ఇష్టం లేక ఆయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పనిచేయలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయినట్లు భావించడంతో అందుకు సిద్దఫడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications