పాట్నాలో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు

ఇంటలిజన్స్ బ్యూరో, ఇతర నిఘా సంస్థలు అందించిన సమాచారం మేరకు బీటార్ స్పెషల్ టాస్క్ పోర్స్ పోలీసులు కంకర్ బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో సుధాకర్ ను అరెస్టు చేశారు.సుధాకర్ నుంచి పోలీసులు సైన్యానికి సంబంధించిన రహస్య పత్రాలను, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అతను గత రెండేళ్లుగా భారత సైన్యం కదలికలపై సమాచారం సేకరిస్తూ ఖాట్మండులసోని పాకిస్తాన్ హై కమీషన్ ద్వారా పాకిస్తాన్ కు సమాచారం పంపిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారానికి పాకిస్తాన్ అతనికి 50 వేల నుంచి లక్ష రూపాయల దాకా చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.
అతని నుంచి సిమ్ కార్డును, నేపాలీ మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో అటువంటి అరెస్టు ఇది రెండోది. శనివారం ఈ నెల 12వ తేదీన ఐఎస్ఎ ఏజెంట్ ఇంతియాజ్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. ఇతన్ని కాన్పూర్ లో అరెస్టు చేశారు. పాకిస్తాన్ లో శిక్షణ పొందినట్లు అలీ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications