ఆస్పత్రిలో చేరిన తార ఆసిన్

ఆసిన్ ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమేనని ఆమె తండ్రి అంగీకరించాడు. ఆందోళన చెందాల్సిందేమీ లేదని, తన కూతురు పెరుగుతున్న క్రమంలో ఈ సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. ఆసిన్ తో పాటు అతను ఆస్పత్రిలో ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లో ఆసిన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది.
ఆసిన్ గత కొంత కాలంగా అక్యూట్ సైనస్ కండీషన్ ను నిర్లక్ష్యం చేస్తోందని, ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని, చికిత్స జరుగుతున్నా ఆమె ఉత్సాహంగా ఉందని, మిత్రులతో చురుగ్గా మాట్లాడుతోందని, పాటలు పాడుతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు. లండన్ డ్రీమ్స్ సినిమా రాత్రి షూటింగ్ ల వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications