ఓషన్ షాట్ - 2 ప్రయోగం సక్సెస్

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్పీ - 14 ఒన్ షాట్ - 2ను, మరో ఆరు ఐరోపా నానో ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి ఎగిసింది. పిఎస్ఎల్పీని ఇస్రో ప్రయోగించడం ఇది 16వ సారి. రెండు నిమిషాల్లోనే పిఎస్ఎల్వీ - 14 మొదటి దశను దాటింది. అది నిర్గిష్ట కక్ష్యలోకి చేరడానికి మొత్తం నాలుగు దశలను దాటాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి హాజరయ్యారు.
పిఎస్ఎల్వీ - 14ను ఇస్రో బుధవారం ఉదయం 11 గంటల 51 నిమిషాలకు అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఓషన్ షాట్ బరువు 960 కిలోలు. భారతదేశానికి సమీపంలో మధ్యాహ్నం 12 గంటలకు భూమధ్య రేఖను దాటే విధంగా దాని కక్ష్యను నిర్దేశించారు. అంచనా ప్రకారం పిఎస్ఎల్వీ - 14 ఓషన్ షాట్ - 2ను నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చించింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో పండుగ వాతావరణం నెలకొంది. శాస్త్రవేత్తలు పరస్పరం అభినందించుకున్నారు.












Click it and Unblock the Notifications