కెసిఆర్ ద్రోహాన్ని తేలుస్తా: అరవింద్

తెరాస ప్రజాకోర్టు పెడితే తెలంగాణలోని పది జిల్లాల నుంచి కెసిఆర్ బాధితులు తరలి వస్తారని, వారు కెసిఆర్ ద్రోహాన్ని బయట పెడతారని ఆయన అన్నారు. తన అభిప్రాయాలను కూడా లేఖ రూపంలో తన అనుచరుల ద్వారా ప్రజాకోర్టుకు పంపుతానని ఆయన అన్నారు. తాను తెరాస వల్ల గెలవలేదని, తన సొంత బలంతోనే శాసనసభ్యుడిగా గెలిచానని ఆయన అన్నారు. కాగా, తెరాస ప్రజాకోర్టు తలపెట్టడంతో మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెరాస నాయకులు బస చేసిన లాడ్జీని పోలీసులు తనిఖీ చేశారు.












Click it and Unblock the Notifications