ఓటరు కార్డులకు సచిన్, ఐష్

ఓటరు ఐడి కార్డు కోసం సచిన్ దరఖాస్తు చేసుకున్నారని, సచిన్ పేరు ఓటర్ల జాబితాలో ఉందని, త్వరలోనే కార్డు సిద్ధం చేశామని జిల్లా డిప్యూటీ కలెక్టర్, డిప్యూటి ఎన్నికల అధికారి సంజయ్ భగవత్ చెప్పారు. సచిన్ మేనేజర్ గురువారంనాడే కార్డును తీసుకున్నారని ఆయన చెప్పారు. ఐశ్వర్యారాయ్ తన జన్మతేదీని ఇవ్వలేదని, ఆమె కార్డు కూడా తయారవుతుందని ఆయన చెప్పారు. అక్షయ్ కుమార్ పేరు ఓటర్ల జాబితాలో లేదు. దాంతో ఆయన అందుకు దరఖాస్తు చేసుకున్నారు. సోనమ్ కపూర్, అనిల్ కపూర్, ప్రీతి జింటాలకు ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు భగవత్ చెప్పారు.












Click it and Unblock the Notifications