జగన్ సభకు శోభనాగి రెడ్డి

Sobha Nagireddy
కర్నూలు: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సంతాపం వ్యక్తం చేయడానికి వైయస్ జగన్ ఏర్పాటు చేసిన సభకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి, నేత భూమా నాగిరెడ్డి దంపతులు హాజరవుతున్నారు. వారు శుక్రవారం ఉదయమే కర్నూలు జిల్లాలోని నల్లకాలువ ప్రాంతానికి చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్న వైయస్ జగన్ కు వారు స్వాగతం పలికారు. వారిద్దరు మాత్రమే కాకుండా కర్నూలు జిల్లాకు చెందిన ఇతర ప్రజారాజ్యం నాయకులు కూడా జగన్ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

శోభా నాగిరెడ్డి జగన్ సభకు హాజరు కావడాన్ని హైదరాబాదులోని ప్రజారాజ్యం పార్టీ నాయకులు తేలికగా కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. వారు జగన్ ను పరామర్శించడానికి మాత్రమే వచ్చారని, అంతకు మించి ఏమీ లేదని చెబుతున్నారు. వారు పార్టీని వీడిపోరని అంటున్నారు. అయితే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి పార్టీ సహకారం అందించాలని శోభానాగిరెడ్డి వంటి శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్న విషయం కొత్తదేమీ కాదు. శోభానాగిరెడ్డి, మరి కొంత మంది జగన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి వెనకాడడం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+