హైదరాబాదు : జంట నగరాల్లో రోజు రోజుకు పెరిగి పోతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు 2000 మంది సిబ్బందిని అదనంగా నియమించనున్నట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బేగంపేటలో కొత్తగా నిర్మించిన ట్రాఫిక్ పోలీసు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు హైదరాబాదులో రోడ్ల విస్తరణ కూడా ఇంకా జరగాలని, పలు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉందని ఆమె తెలిపారు.