హైదరాబాదు : ఆదివారం ఉదయం రాష్ట్రంలో పలు చోట్ల మబ్బులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్, విజయవాడలతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమయి మబ్బులు కమ్ముకున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనమే దీనికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.