20కి పైగా విమానాల రద్దు

పైలట్లు సిక్ లీవులు పెట్టడంతో బెంగుళూర్, కోల్ కత్తా, చెన్నై, గౌహతి, ముంబై తదితర ప్రదేశాలకు వెళ్లే పది దేశీయ విమానాలు, కాబూల్, ఖాట్మండ్, న్యూయార్క్, లండన్, చికాగోలకు వెళ్లాల్సిన ఐదు విదేశీ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విలీనానికి ముందు చేరిన ఎగ్జిక్యూటివ్ పైలట్లు కూడా చేరడంతో సమ్మె మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. శనివారం నుంచి ఎగ్జిక్యూటివ్ పైలట్లు సిక్ లీవులు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రతి రోజు 55 విమానాలను నడుపుతుంది. అయితే మంగళవారం సాయంత్రం నుంచి 16 విమానాలను మాత్రమే నడపాలని నిర్ణయించింది. పైలట్ల అందుబాటును బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ తాత్కాలిక ఏర్పాటు చేసింది. చెన్నై, ముంబై, కోల్ కత్తాల నుంచి మంగళవారం ఉదయం బయలుదేరాల్సిన దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications