ఉగ్రవాదిని కాల్చేసిన ధీర వనిత

ఆమెకు గ్రామ రక్షణ కమిటీ ఇచ్చిన శిక్షణ ఇందుకు ఉపయోగపడింది. కలస్నికోవ్ ఆసాల్ట్ రైఫిల్ ను ఎలా వాడాలనే విషయంపై ఆమె గ్రామ రక్షణ కమిటీ నుంచి శిక్షణ పొందింది. ఉగ్రవాదిని గోడకు అదిమిపట్టానని, ఆ తర్వాత రైఫిల్ గన్ బట్ తో కొట్టానని, ఆ తర్వాత పలు మార్లు కాల్పులు జరిపానని రుక్సానా చెప్పింది.
ఆదివారం రాత్రి ఆరుగురు ఉగ్రవాదులు రుక్సానా ఇంటికి వచ్చారు. రుక్సానాను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో ఆమె తల్లిదండ్రులను కొట్టారు. ఆమె సోదరుడు గొడ్డలితో వారిని ఎదిరించాడు. రుక్సానా ఉగ్రవాది గన్ ను లాక్కుంది. రుక్సానా కుటుంబం తమకు ఆయుధాలు అప్పగించిందని, ఎదురుకాల్పుల గురించి చెప్పారని రాజౌరీ ఎస్పీ షబ్బీర్ చౌదరి చెప్పారు. అయితే ఉగ్రవాదులు ప్రతీకార దాడికి దిగుతారనే భయంతో రుక్సానా కుటుంబ సభ్యులు స్థానిక పోలీసుల, సైన్య రక్షణ కోరుతున్నారు.












Click it and Unblock the Notifications