వైయస్ జగన్ పేర హనుమంతరావుకు బెదిరింపులు

Hanumantha Rao
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నేత , రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని బెదిరిస్తున్నారని హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని అంబర్ పేటలో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ను ఆయన వ్యక్తిగత కార్యదర్శి తీసుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోయినా, జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడినా చంపేస్తామని అవతలి వ్యక్తి బెదిరించడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న సబ్ ఇన్ స్పెక్టర్ గట్టు మల్లుకు ఫోన్ ఇచ్చాడు. ఎస్ఐతోనూ ఆవతలి వ్యక్తి అలాగే మాట్లాడాడు. ఈ విషయాన్ని విహెచ్ కు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వారం రోజుల కిందట తమ పార్టీకి చెందిన రాఘవరెడ్డి తనను చంపుతానని బహిరంగంగా బెదిరించాడని, అయినా పోలీసులు పట్టించుకోలేదని హనుమంతరావు విమర్శించారు. బెదిరింపు కాల్స్ ఎవరు చేయిస్తున్నారనే విషయంపై తాను మాట్లాడబోనని, అది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని ఆయన అన్నారు. విహెచ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+