వెనక్కి తగ్గని జగన్ వర్గీయులు

కాగా, వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు రాజయ్య కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. రోశయ్య సిఎల్పీ ఎన్నుకోలేదని, అందువల్ల రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రేనని కొండా సురేఖ అన్న మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామాలు చేయడానికి కొత్త శాసనసభ్యులతో పాటు సీనియర్ శాసనసభ్యులు కూడా కట్టుబడి ఉన్నారని ఆయన అన్నారు. జగన్ కు మద్దతిస్తూ తాను పార్టీ అధిష్టానానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోనని ఆయన చెప్పారు. కాగా, జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు వారు కడప జిల్లా పరిషత్ సమావేశాన్ని అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications