నిరూపిస్తే రాజకీయ సన్యాసం: దానం

వైయస్ మరణాంతరం సంభవించిన మరణాలపై జిల్లాలవారీగా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని ఆయన చెప్పారు. మీడియాలో ప్రచారం పొందడానికి హనుమంతరావు అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. జగన్ నల్లకాలువలో వైయస్ సంతాప సభకు వెళ్లారు తప్ప రాజకీయ సభకు వెళ్లలేదని, దీన్ని కూడా సీనియర్ నేతలు వివాదాస్పదం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు తాము మౌనంగా ఉన్నామని, కానీ హనుమంతరావు నోరు పారేసుకుంటున్నారని ఆయన అన్నారు. మౌనంగా ఉన్నంత మాత్రాన తాము చేతకానివాళ్లం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications