హైదరాబాద్: దుబాయ్ - హైదరాబాద్ ఎమరేట్స్ విమానంలో ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఒక ప్రయాణికుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం చెప్పారు. విమానం హైదరాబాదుకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ ప్రయాణికుడిని అబు దుబాయ్ కి చెందిన రియాత్ కల్ఫాన్ గా గుర్తించారు.
అతనిపై 304 సెక్షన్ కింద, ఐపిసి 509 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రియాత్ కల్ఫాన్ ను కోర్టులో హాజరు పరుస్తామని వారు చెప్పారు.