జగన్ మద్దతుదారుల వీరంగం

YS Jagan
సామర్లకోట: వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెసు కార్యకర్తలు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను, అద్దాలను ధ్వంసం చేశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సమావేశం నిర్వహించకూడదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరుగుతుండగా వారు ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ధర్నాకు దిగారు.

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కాంగ్రెసుకు చెందినవారే. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తొలుత సమావేశంలో తీర్మానం చేస్తామని వారిద్దరు ఆందోళనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు వారి మాటలను పట్టించుకోలేదు. కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో సమావేశం జరగలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఈ సంఘటనపై పోలీసు కేసు కూడా నమోదు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+