భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం, 15మంది మృతి

అనంతరం ఆ వివరాలను ధర్మాన మీడియాకు వివరిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. అలాగే మరో వారంలో కరువు మండలాలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్‌కు భారీగా వరదనీరు రావటంతో మరో రెండు, మూడు రోజుల్లో పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.
వరద నీటిని చెరువులు, రిజర్వాయర్‌లకు విడుదల చేయనున్నట్లు ధర్మాన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వరద సహాయక చర్యలకు జిల్లా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications