చెన్నై: ప్రభాకరన్ ఇంకా బ్రతికే వున్నాడని, ఆయనను ఎల్ టీటీఇ కార్యకర్తలు తుపాకులతో 24గంటలు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారని, ప్రభాకరన్ మరణించినట్లు శ్రీలంక ప్రభుత్వం నాటకమాడుతోందని, త్వరలోనే ప్రభాకరన్ లంకలో దర్శనం ఇస్తారని శరణార్థ్ధులు నమ్మకం వ్యక్తం చేసినట్లు క్యూ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఈ అభిప్రాయాలను తాము ప్రభుత్వానికి నివేదికగా అందజేస్తామని వారు తెలిపారు. రాష్ట్రంలో వున్న శరణార్ధుల శిబిరాల్లో క్యూ బ్రాంచ్ పోలీసులు, రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ పోలీసులు బుధవారం నుంచి తనిఖీలు ప్రారం భించారు. ఈ సందర్భంగా స్వదేశానికి వెళ్ళాలని ఇష్టపడుతున్న శరణార్థుల వివరాలను సేకరించారు.శ్రీలంకలో జరుగుతున్న మార్పులు, ఎల్ టీటీఇ చీఫ్ ప్రభాకరన్‌కు సంబంధించిన వివరాలపై పలువురు శరణార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక శ్రీలంక సైన్యం జరిపిన యుద్దంలో గత మే నెల 19వ తేది ప్రభాకరన్ మరణించినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.