హైదరాబాదు: వైయస్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంతవరకూ నివసిస్తున్న క్యాంపు కార్యాలయ్యాన్ని ఖాలీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే క్యాంపు కార్యాలయం సి.ఎం అదికారక నివాసం. దీంతో ఇప్పటివరకు క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ కుటంబం బంజారాహిల్స్‌లోని ఆయన కుమార్తె నివాసానికి మారారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన రేపటికి నెలరోజులు పూర్తవుతుంది. అలాగే రోశయ్య అక్కడికి తన నివాశాన్ని అధికారికంగా మారే అవకాశం ఉంది.