Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్ని చర్యలూ తీసుకుంటాం, భారీ వర్షాలపై సీఎం రోశయ్య

Rosaiah
హైదరాబాద్: వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. వరద పరిస్థితిని ఆయన శుక్రవారం ఉదయం సమీక్షించారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. కర్నూలు పరిస్థితిపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. కర్నూలు వెళ్లాల్సిందిగా ఆయన మంత్రి రఘువీరా రెడ్డిని ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారుల సెలవులు రద్దు చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కర్నూలుకు నాలుగు హెలికాప్టర్లు పంపామని, అయితే వాతావరణ సరిగా లేకపోవడంతో అవి వెనక్కి తిరిగి వచ్చాయని ఆయన చెప్పారు.

రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీతో రోశయ్య మాట్లాడి రెండు సైనిక హెలికాప్టర్లను పంపాల్సిందిగా కోరారు. బెంగుళూరు నుంచి రెండు హెలికాప్టర్లను రప్పిస్తున్నారు. ఇంత భారీ వర్షాలు వస్తాయని ఊహించలేదని ఆయన చెప్పారు. వరద సహాయక చర్యలు చేపట్టడానికి నిధుల కొరత లేదని, ట్రెజరీ నుంచి నేరుగా డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యాన్ని వాడుకోవాలని కలెక్టర్లకు సూచించామని ఆయన చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+