హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. అలాగే బాధితులను అన్ని విధాలా అదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.తినడానికి తిండిలేక మహబూబ్‌నగర్ జిల్లాలోని వందలాది మంది బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా సకాలంలో స్పందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే తన అబిమానులను కూడా వరద భాధితులకు సాయం చేయమని ఆయన కోరారు.