విజయవాడ: విజయవాడ నగరానికి తీవ్రస్థాయిలో వరదముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి బొత్సా సత్యనారాయణ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం 29 సహాయ శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఆర్మీ హెలికాప్టర్లు, మరబోట్లు సిద్దంగా ఉంచామని మంత్రి చెప్పారు. శిబిరాల్లో ఉన్న బాధితులకు ఆహార కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.