వరద నష్టం రూ. 12,225 కోట్లు

ఇళ్లకు జరిగిన నష్టం రూ.300 కోట్లు, వ్యవసాయం, పండ్ల తోటలకు వాటిల్లిన నష్టం 1,005 కోట్ల మేరకు ఉంటుందని ఈ నివేదికలో తెలియజేశారు. రోడ్లు, విద్యుత్, తదితర సౌకర్యాలకు జరిగిన నష్టం కూ. 10,000 కోట్లు ఉంటుందని తెలిపారు. పునరావాసం, ఆహారం సరఫరాకు రూ. 500 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. వరద సాయం కోసం తక్షణమే 6 వేల కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసేలా చూడాలని రోశయ్య సోనియాను కోరారు. వరద ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరుతూ రోశయ్య ప్రధాని మన్మోహన్ సింగ్ కు మరో లేఖ రాశారు.












Click it and Unblock the Notifications