జాతీయ విపత్తు: సోనియాతో రోశయ్య

ముఖ్యమంత్రి కార్యాలయం సి - బ్లాకులోకి ప్రవేశించిన తర్వాత రోశయ్య సోమవారం ఉదయం సోనియా గాంధీకి సమర్పించే వినతిపత్రంపై తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ప్రతి కుటుంబానికి 30 కిలోల బియ్యం ఇచ్చేందుకు కేంద్ర సాయం కోరుతూ మరో ఫైల్ పై సంతకం చేశారు. సోనియాతో పాటు వరద తాకిడి ప్రాంతాలకు ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications