భయం గుప్పిట్లో దివిసీమ, బెజవాడ

కృష్ణా జిల్లాలోని మూలపాడు 9 నెంబర్ జాతీయ రహదారిపై మూడు అడుగుల మేర నీరు నిలిచి ఉంది. పోయపాడు వద్ద కరకట్టకు గండి పడింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బరాజ్ వద్ద వరద ప్రవాహం రికార్డు స్థాయిలో ఉండడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇంకా ప్రమాదం పొంచే ఉంది. అవనిగడ్డ, నాగాయలంక, కోడుమూరు మండలాల్లోని గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. విజయవాడలోని భవానీపురం, విద్యాధర పురం నుంచి 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications