అవనిగడ్డకు ముంపు ప్రమాదం

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీకి 10.66 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీని నుంచి 10 లక్షల నీరు వదులుతున్నారు. దీంతో ఎడమ కరకట్టకు ప్రమాదం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంత వరద ప్రవాహం పెరిగి స్థిరీకరణ చెందే అవకాశం ఉంది. ఈ పరిస్థితి మరో 22, 23 గంటలు కొనసాగే అవకాశం ఉంది. కరకట్టలకు గండ్లు పడకపోతే ప్రమాదం పెద్దగా ఉండదు. అయితే గండ్లు పడతాయనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎడమ కరకట్టకు ఏ విధమైన ప్రమాదం ఉండదని చీఫ్ డిజైన్ ఆఫీసర్ రాజు తెలిపారు. కట్టపై అధికారులు గస్తీ తిరుగుతున్నారు. కరకట్టలకు ఇసుక బస్తాలు అడ్డం వేస్తున్నారు.












Click it and Unblock the Notifications