వరద సాయంపై మంత్రుల అశ్రద్ధ: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: వరద పరిస్థితులపై అధికారులు, మంత్రులు శ్రద్ధ వహించడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరద బాధితులకు సహాయం అందించడంలో మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వరద బాధితుల సహాయానికి విరాళాలు అందించినవారి వివరాలను ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు.

గండి పడిన కృష్ణా నది కరకట్టలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద తాకిడి ప్రాంతాల్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారని, ప్రజలు ఆదుకోవడంలో అధికారులు, మంత్రులు సరిగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. ముంపునకు గురైన మహబూబ్ నగర్, కర్నూలు, కృష్ణా, గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఆయన మరోసారి గురువారం పర్యటించనున్నారు. ఆయన వరద తాకిడి ప్రాంతాల్లో ఇప్పటికే ఒకసారి ఏరియల్ సర్వే నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+