నిమ్మకు నీరెత్తినట్లున్నారు: చిరంజీవి

Chiranjeevi
కర్నూలు: వరద బాధితులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ధ్వజమెత్తారు. వరద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరదలు వచ్చాయి అవే పోయాయి, బురద పేరుకు పోయింది వారే తొలగించుకుంటారనే పద్ధతిలో అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాధితులు ఆదుకునే వారు లేక ఆకాశానికేసి చేతులెత్తి దండం పెడుతున్నారని ఆయన అన్నారు. రెండు మూడు జిల్లాల్లో వరదలు వస్తేనే ఇంతగా అధికార యంత్రాంగం విఫలమైతే మరిన్ని జిల్లాలను వరదలు తాకితే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేని స్థితి ఉందని ఆయన అన్నారు.

కర్నూలు పట్టణంలో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని నిస్సహాయ స్థితిలో అధికారులున్నారని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో లేకపోతే ఇతర జిల్లాల నుంచైనా తెప్పించే వీలు లేదా అని ఆయన అన్నారు. కర్నూలులో వరద బాధితుల స్థితి ఆందోళనకరంగా ఉందని, ఇళ్లలో బురద పేరుకుపోయిందని ఆయన అన్నారు. ఒక్క జిల్లానే ఆదుకోలేని అధికారులు రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటారని ఆయన అడిగారు. బాధితుల కోసం తెచ్చే వస్తు సామగ్రిని ఎక్కడ అందించాలో కూడా తెలియని అయోమయ స్థితి ఉందని ఆయన చెప్పారు. పరిస్థితి దారుణంగా ఉందని ఆయన విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+