సహాయం సరిపోదు: చిరంజీవి

Chiranjeevi
కర్నూలు: వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయం, చెల్లిస్తున్న నష్ట పరిహారం సరిపోదని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. బాధితులను ఆదుకునే విషయంలో లెక్కలు వేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఆయన మంగళవారంనాడు వరద తాకిడికి గురైన కర్నూలు నగరంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలో సంభవించిన ముప్పును జాతీయ విపత్తుగా పరిగణించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో మీనమేషాలు లెక్కించకూడదని ఆయన కేంద్రానికి సూచించారు. వరద తాకిడి ప్రాంతాల్లోని ప్రజలు సర్వం కోల్పోయారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

రైతులు పంటలు కోల్పోవడమే కాకుండా తదుపరి పంట వేసుకునే స్థితిలో కూడా లేరని, పొలాల్లో 20 అడుగుల మేర ఇసుక మేట వేసిందని ఆయన చెప్పారు. చేతి వృత్తుల వారికి కూడా తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉందని, వారు పూర్తిగా జీవనోపాధిని కోల్పోయారని ఆయన అన్నారు. తక్షణ సహాయం కింద కనీసం ఐదేసి రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఐదు లక్షల రూపాయలకు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ శాసనసభ్యులు తమ వేతనం ఇస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీ తరఫున, చిరంజీవి ట్రస్టు తరఫున విరాళాలు సేకరిస్తున్నామని, అయితే తాము ఇచ్చే సహాయం సరిపోదని, ప్రజలు కోలుకోవాలంటే ప్రభుత్వమే పెద్ద యెత్తున ముందుకు రావాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+