కర్నూలు, పాలమూరు బురద కష్టాలు

Kurnool
హైదరాబాద్: కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలు వరద నుంచి బయటపడినప్పటికీ ప్రజల కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. వరద ప్రమాదం నుంచి బయటపడిన ప్రజలు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఆహారం పొట్లాల కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇంతటి కష్టాలను ఎప్పుడూ చూడలేదని ప్రజలు అంటున్నారు. కర్నూలు పాతనగరంలో ప్రజలు దుస్తుల కోసం, ఆహారం కోసం ఎగబడుతున్నారు. ఇళ్లలో మోకాలి లోతు బురద పేరుకు పోయి ఉంది. కర్నూలులో 600 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్లనే వారు అస్వస్థతకు గురైనట్లు భావిస్తున్నారు. బయటి నుంచి పునరావాస కేంద్రాలకు ఆహారం పొట్లాలు తేవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వం కిరోసిన్, బియ్యం, తదితర నిత్యావసర సరుకుల పంపణీకి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు తెరిచారు. అయితే వాటిని వండుకునే పరిస్థితి వరద తాకిడి ప్రాంతాల్లో లేదు. బురద తీసేస్తే తప్ప వండుకుని తినే పరిస్థితి ఉండదు. అంటువ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం వైద్యు బృందాలను ఏర్పాటు చేసింది. పంటపై కూడా పెద్ద యెత్తున బురద పేరుకుపోయింది. ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+