యుపి సిఎస్ పై కోర్టు ఉల్లంఘన చర్యలు

కోర్టు ఉల్లంఘన కింద ఎందుకు చర్యలు చేపట్టకూడదో, కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు శిక్ష వేయకూడదో వివరించాలని ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విగ్రహాల స్థాపన పనులు ఆపేయాలని ఇంతకు ముందు సుప్రీంకోర్టు మాయావతి ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు అంగీకరించినప్పటికీ ప్రభుత్వం పనులు ఆపలేదని సుప్రీంకోర్టు ఇటీవల మండి పడింది. ఇతర పార్టీలతో మాదిరిగా కోర్టులతో రాజకీయాలు ఆడవద్దని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చిరించింది.












Click it and Unblock the Notifications