కృష్ణా ఉగ్రరూపం: కరకట్టలకు ప్రమాదం

Krishna River
విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్టలకు ప్రమాదం పొంచి ఉంది. కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చి చేరింది. సోమవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో కృష్ణా నదికి కృష్ణా బ్యారేజీ వద్ద 11.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఇంత భారీగా 1903లో కృష్ణా బ్యారేజీకి నీరు వచ్చింది. మళ్లీ ఇదే మొదటిసారి. దీంతో కృష్ణానది కరకట్టలకు ప్రమాదం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరకట్టలపైకి నీరు చేరడానికి రెండు అడుగులు మాత్రమే ఉంది. కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద కరకట్టకు కోత పడింది. దీంతో అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. కృష్ణా నదికి నాగార్జున సాగర్ నుంచి వరద ప్రవాహం తగ్గింది. ఇది 10.3 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో ప్రమాదం ఉండకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

వరద ప్రవాహం ఇదే పద్ధతిలో ఉంటే మరో రెండు మూడు రోజుల పాటు కృష్ణా బ్యారేజీ వద్ద వరద స్థిరీకరణ పొందుతుందని, దాని వల్ల ప్రమాదం ఉండదని అంటున్నారు. నాగార్జున సాగర్ నుంచి 7.5 లక్షల క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారని, ఇది మంచి పరిణామమని అంటున్నారు. అయితే కరకట్టలకు గండ్లు పడకుండా చూడాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

హంసల దీవి గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. పులిగడ్డ అక్విడెక్ట్ ఇంకా మునకలోనే ఉంది. బొబ్బర్లంక తదితర ఐదు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అవనిగడ్డ, నాగాయలంక తదితర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ సౌకర్యాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. భట్టిప్రోలు వద్ద కూడా కరకట్టకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమ కృష్టా జిల్లా మొత్తం అతలాకుతలమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+