నేను కులాన్ని నమ్మను: రాహుల్

తన సందర్శనలను దళితుల ఇళ్ల పర్యటనలుగా మీడియా చిత్రీకరిస్తోందని రాహుల్ అన్నారు. దళితులు అనే చట్రం మీదని, తనది కాదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. పేద గ్రామంలోని అతి పేద కుటుంబాన్ని సందర్శించడానికి ఏర్పాట్లు చేయాలని తాను తన కార్యాలయానికి సూచిస్తానని, అతడిని మీరు దళితుడిగా చూస్తారని, తాను పేదవాడిగా చూస్తానని ఆయన అన్నారు.
తాను టీ కొట్టు వ్యాపారిని, విశ్వవిద్యాలయ విద్యార్థిని ఒకే రకంగా చూస్తానని, నీవు దళితుడివా అని టీకొట్టు వ్యాపారివా అని తాను అడగబోనని, తేడా అవకాశాల్లోనే ఉందని, వారు విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి అవసరమైన తెలివితేటలున్నవారని, అయితే వారికి అవకాశాలు రావడం లేదని, అదే తేడా అని ఆయన అన్నారు. తాను మరణించినప్పుడు మాత్రమే నేర్చుకోవడం ఆగిపోతుందని ఆయన చెప్పారు. నేర్చుకోవడం ఆచరణ అని, ఆచరణ నేర్చుకోవడమని ఆయన అన్నారు. మాయావతి వ్యతిరేకించినప్పటికీ తాను పేదల ఇళ్లకు వెళ్లి తీరుతానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications