సీమ శ్రీమంతుడికి ఇల్లు లేదు

TG Venkatesh
కర్నూలు: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెసు శాసనసభ్యుడు టిజి వెంకటేష్ ను రాయలసీమ ప్రాంతంలోనే అత్యంత సంపన్నుడిగా పరిగణిస్తారు. అయితే ఆయనకు ఇప్పుడు ఇల్లు లేదు. వరద బాధితుల సహాయార్థం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అయితే ప్రస్తుతం వరదలకు ఇల్లు కోల్పోయి ఆయన కర్నూలులోని హోటల్ గదిలో ఉంటున్నారు. అక్కడి నుంచే ఆయన కర్నూలులో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

వెంకటేష్ ఇల్లు ఐదెకరాల స్థలంలో విస్తరించి ఉంటుంది. ఆయనకు తుంగభద్ర, హంద్రీ నదుల తీరంలో ఆస్పత్రి, మూడు నక్షత్రాల హోటల్ ఉన్నాయి. అవి ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. కర్నూలులోని నర్సింగరావుపేటలోని ఆయన ఇల్లు మునిగిపోయిందని, దాంతో వరదల వల్ల ఈ నెల 2వ తేదీన ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెంకటేష్ ఉద్యోగ వర్గాలంటున్నాయి.

కర్నూలు ప్రజల ఇక్కట్లు ఇన్నిన్నని చెప్పలేమని, తన ఒక్కడి ఇల్లే కాదు, మొత్తం పట్టణమే నీట మునిగిందని, వరదలు మిగిల్చిన నష్టాన్ని పూడ్చడం అంత తేలిక కాదని వెంకటేష్ ఒక ఆంగ్లదిన పత్రికతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+