త్వరలో రోశయ్య కేబినెట్ లో మార్పులు

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖఱ రెడ్డి పక్కన పెట్టి సీనియర్లకు ఆయన మంత్రివర్గంలో అవకాశాలు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కె.జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డిఎల్ రవీంద్రారెడ్డి, పి.శంకరరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలకు రోశయ్య తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వార్తలు వస్తున్నాయి. కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆనం రాంనారాయణ రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మర్రి శశిధర్ రెడ్డికి శాసనసభ స్పీకర్ పదవి ఇవ్వవచ్చుననే ప్రచారం జరుగుతోంది.
కొండా సురేఖ ఇటీవల రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోశయ్య పూర్తి కాలం ముఖ్యమంత్రి కారని ఆమె విరుచుకుపడ్డారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆమె అన్నారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి కూడా రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ కు పూర్తి విధేయతను ప్రకటించారు. సీనియర్లతో కూడిన తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్టీ అధిష్టానం రోశయ్యకు అవకాశం కల్పిస్తుందని చెబుతున్నారు. మొదటి నుంచి మర్రి శశిధర్ రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డి దూరం పెడుతూ వచ్చారు.












Click it and Unblock the Notifications