బాధితులను ఆదుకుంటాం: జగన్

YS Jagan
కడప: వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన వరసగా మూడో రోజు బుధవారం కడప జిల్లాలోని వరద బాధితులను పరామర్శించారు. వరద తాకిడి ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు దెబ్బ తిన్నాయి. అయినా ఆయన వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను ఓదారుస్తున్నారు. పుట్టిపై, ట్రాక్టర్ పై, ఎడ్ల బండిపై ఆయన ప్రయాణించి వరత తాకిడి గ్రామాలను చేరుకున్నారు. బుధవారంనాడు ఆయన చాపాడు మండలం కుందూ నది వరద ఉధృతిని పరిశీలించారు.

దువ్వూరు మండలం ఖానా గూడూరులో పసుపు పంటను పరిశీలించారు. ఆ తర్వాత నేలటూరు గ్రామాన్ని సందర్శించారు. రోడ్లు, పొలాలు పూర్తిగా నీటి మునిగిన విషయాన్ని గమనించారు. ఆ గ్రామంలోకి కూడా వెళ్లి ప్రజల సమస్యలు విన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+