కెసిఆర్ ను జైల్లో పెట్టాలి: జీవన్ రెడ్డి

Jeevan Reddy
హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును ప్రాసిక్యూట్ చేసి ఆయనను జైలులో పెట్టాలని కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండి పడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని, దాన్ని విమర్శించడం కెసిఆర్ మూర్ఖత్వమని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం దారుణమైన విషయమని ఆయన అన్నారు. కెసిఆర్ యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని ప్రశంసించడం కూడా ఆవకాశవాదమేనని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ కాంగ్రెసులో చేరడానికి కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ అంతటి అవకాశవాది దేశంలో మరో రాజకీయ నాయకుడు లేడని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+