వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘనంగా బిగ్-బీ బర్త్ డే

By Srikanya
|
Google Oneindia TeluguNews

Amitab Bachchan
ముంబయి : బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఈ రోజు(ఆదివారం)67వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను భార్య జయ బచ్చన్‌, కుమారుడు అభిషేక్‌బచ్చన్‌, కోడలు ఐశ్వర్యరాయ్‌లతో పాటు అనిల్‌ అంబానీ, అమర్‌సింగ్‌ కుటుంబాల సమక్షంలో జరుపుకోనున్నారు.బచ్చన్ పుట్టినరోజు సందర్బంగా దేశంలో చాలా చోట్ల ఆయన అభిమానులు రక్త దానం,అన్నదానం వంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ ''అశోక్‌కుమార్‌ లాంటి నటుడు 80 ఏళ్లు వచ్చిన తరవాత కూడా మంచి మంచి పాత్రలు పోషించారు. నేను కూడా అలాగే కొనసాగాలని కోరుకొంటున్నాను. ప్రస్తుతం నా చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. 'అల్లాద్దీన్‌' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాని తరవాత డిసెంబరు 4న 'పా' విడుదలవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న 'తీన్‌ పత్తి' రానుంది.

మూడు చిత్రాల్లోనూ నావి వైవిధ్యమైన పాత్రలు. తప్పకుండా అందరికీ నచ్చి తీరుతాయి. బుల్లి తెరపై ఓ రియాల్టీ కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరించబోతున్నాను. భవిష్యత్తులో కూడా ఎప్పుడూ ఇలాగే తీరిక లేకుండా ఉండాలని కోరుకొంటున్నాను. వయసుకు తగ్గ పాత్రల్నే పోషించాలన్న నియమం కూడా పెట్టుకున్నాన''ని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X