వాషింగ్టన్: స్వలింగ సంపర్కులకు సైన్యంలో ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు కట్టుబడి ఉన్నానని అమెరికా అధ్యక్షుడు పునరుద్ఘటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వలింగ సంపర్కు పాలసీ మార్పులకు సంబంధించి చేసిన వాగ్ధానం త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని భరోసా ఇచ్చారు. స్వలింగ సంపర్కుల పౌర హక్కుల సంస్థతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఒబామా ఈ మేరకు స్పష్టం చేశారు.